Karthika Deepam 2: కాశీ వర్సెస్ స్వప్న.. వాళ్ళ నాన్న తప్పు చేయలేదని కార్తీక్ నిరూపిస్తాడా!
on Dec 25, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -549 లో... నాన్న తప్పు చేశారంటే ఇక్కడ ఎవరు నమ్మరని కార్తీక్ కాన్ఫిడెంట్ గా చెప్తాడు. అది విని.. తాత నువ్వు మావయ్య తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదని శివన్నారాయణ అంటాడు. అలాగని తప్పు చేసాడని అనుకోవడం లేదు.. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నానని శివన్నారాయణ అంటాడు.
మరొకవైపు కాశీ ఇంటికి వస్తాడు. ఇంట్లో నుండి వెళ్ళిపో మీ మావయ్య గురించి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా అని కావేరి తనపై కోప్పడుతుంది. నేను చేసింది కరెక్ట్ అందుకే ఆయన సైలెంట్ గా పోలీస్ లతో వెళ్ళిపోయాడని కాశీ అంటాడు. అయిన ఇప్పుడు ఆ జాబ్ కి రాజీనామా చేసాను. ఇంట్లో నుండి వెళ్ళమంటే చెప్పండి వెళ్ళిపోతానని కాశీ అనగానే.. నువ్వు ఉండాలి కాశీ.. మా డాడీ ఏ తప్పు చెయ్యలేదని నువ్వు వినాలని స్వప్న అంటుంది.
ఆ తర్వాత సుమిత్ర అమ్మ ఏమైనా ఫోన్ చేసిందా అని జ్యోత్స్నని దీప అడుగుతుంది. ఎందుకు మా అమ్మ గురించి అంత టెన్షన్ అని అప్పుడు కూడా దీపతో కోపంగా మాట్లాడుతుంది జ్యోత్స్న.
మరొకవైపు సుమిత్రకి టెస్ట్ చేసి డాక్టర్ లోపలికి రమ్మని దశరథ్ ని పిలుస్తాడు. తనతో పాటు సుమిత్ర కూడ లోపలకి వెళ్తుంది. మీరు రెండు రోజులు హాస్పిటల్ లో అడ్మిట్ కావాలని డాక్టర్ సుమిత్ర గురించి అనగానే నాకేం అయింది.. ఏం కాలేదు పదండి అని సుమిత్ర బయటకు వెళ్లిపోతుంది. ఏమైంది డాక్టర్ అని దశరథ్ డాక్టర్ ని అడుగుతాడు. తనకి మేజర్ ప్రాబ్లమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. టెస్ట్ లకు పంపించాం.. ఆ రిపోర్ట్స్ తో పెద్ద డాక్టర్ వస్తాడు.. రిపోర్ట్స్ వచ్చాక కాల్ చేస్తామని డాక్టర్ చెప్తాడు.
ఆ తర్వాత సుమిత్ర, దశరథ్ ఇంటికి వెళ్తారు. దీప ఎదురుగా వచ్చి ఏమైంది అమ్మ అని అడుగుతుంటే.. పనిమనిషివి అమ్మగారు అనాలని పారిజాతం అంటుంది. ఆ తర్వాత రెస్టారెంట్ విషయంలో జరిగింది మొత్తం దశరథ్ కి శివన్నారాయణ చెప్తాడు. నా తండ్రి ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



